‘కన్నప్ప’లో మంచు విష్ణు కొడుకు.. అవ్రామ్ ఫస్ట్ లుక్ చూశారా!
- MediaFx
- Aug 26, 2024
- 1 min read
మంచు ఫ్యామిలీ నుంచి మరో తరం ఎంట్రీ ఇస్తుంది. టాలీవుడ్ సినీయర్ కథానాయకుడు మంచు మోహన్ బాబు మనవడు, మంచు విష్ణు కొడుకు అవ్రామ్ (Avraam) ‘కన్నప్ప’లో (Kannappa) చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు. నేడు కృష్ణాష్టమి పండుగా సందర్భంగా చిత్రబృందం విషెస్ తెలుపుతూ.. అవ్రామ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇక అవ్రామ్ ఇందులో తిన్నడు అనే పాత్రలో నటించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కన్నప్ప(మంచు విష్ణు) చిన్నప్పటి పాత్ర తిన్నడు (Tinnadu)గా అవ్రామ్ కనిపించనున్నట్లు వెల్లడించింది. ఇక మంచు కుటుంబం నుంచి మూడో తరం ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులతో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా నటిస్తున్నాడు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు.