‘లాల్ సింగ్ చద్దా’ నా వల్లే ఫ్లాప్ అయ్యింది : ఆమీర్ ఖాన్
- MediaFx

- Aug 26, 2024
- 1 min read
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’. ‘తారే జమీన్ పర్’ సినిమాకు సీక్వెల్ లాగా వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు ముందు చాలా రోజులు అమీర్ గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. 2022లో ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో అమీర్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో ఆశలతో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయం పాలవడంతో అమీర్ నిరాశ చెందారు. అయితే తాజాగా ఈ సినిమా పరజయంపై స్పందించాడు అమీర్ ఖాన్. బాలీవుడ్ నటి రియా చక్రవర్తితో కలిసి ఒక టాక్ షోలో పాల్గోన్న ఆమీర్ ‘లాల్ సింగ్ చద్దా’ డిజాస్టార్ అవ్వడం గురించి స్పందిస్తూ.. లాల్ సింగ్ చద్దాలో నా పెర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ అయ్యింది. ఫారెస్ట్ గంప్‌లో టామ్ హాంక్స్ చాలా అద్భుతంగా నటించాడు. అతడు నటిస్తున్నప్పుడు అందరు తనతో కలిసి ట్రావెల్ చేశారు. నా అంచనా ప్రకారం నా నటన వల్లనే లాల్ సింగ్ చద్దా ఫ్లాప్ అయ్యింది. అందుకే జనాలు కనెక్ట్ కాలేదు అయితే ఈ తప్పును ‘సితారే జమీన్ పర్’లో చేయను అని అనుకుంటున్నాను. ఏమవుతుందో చూడాలి అంటూ ఆమీర్ చెప్పుకోచ్చాడు.











































