top of page

మెగా పవర్ స్టార్ టూ గ్లోబల్ స్టార్.. రామ్ చరణ్ పుట్టినరోజు స్పెషల్..🎥✨

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసి ఇప్పుడు గ్లోబల్ స్టార్‏గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు హీరో రామ్ చరణ్. వైవిధ్యభరిత కథలను ఎంచుకుంటూ విలక్షణ నటనతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను మెస్మరైజ్ చేశాడు.

మెగా వారసుడిగా తెరంగేట్రం చేసినా.. అద్భుతమైన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ముందు స్టార్ కిడ్ అని.. విమర్శలు వచ్చినా.. రంగస్థలం సినిమాతో  విమర్శించిన చోటే ప్రశంసలు అందుకున్నాడు. నటనతో సినీ ప్రముఖులు, అభిమానులతో భేష్ అనిపించున్నాడు. చిరుత సినిమాతో హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన చరణ్.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి మెగా పవర్ స్టార్ అనిపించుకున్నారు. సినీ ప్రయాణంలో ఓవైపు వారసత్వం అన్న విమర్శలు.. మరోవైపు పరాజయాలు ఎదురైనా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా కసిగా నటించి తానేంటో నిరూపించుకుని ఆస్కార్ వేదికపై అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ అయ్యాడు. మెగా పవర్ స్టార్ సినిమాలకు ఇప్పుడు ప్రేక్షకలోకం నీరాజనం పడుతుంది. ఒకప్పుడు చిరంజీవి క్రేజ్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మేనియా.. నేటితరానికి రామ్ చరణ్ అంటే అదే రేంజ్ క్రేజ్ ఉందంటే అతిశయోక్తి లేదు. చరణ్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులు ఉన్నారు.

నటుడిగానే కాకుండా బెస్ట్ డ్యాన్సర్‎గా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిజం రోల్స్ కాదు.. కంటెంట్ బలంగా ఉంటే ఎలాంటి పాత్ర అయినా చేయగలనని రంగస్థలం సినిమాతో నిరూపించారు. అమ్మ ప్రేమ కోసం ఆరాటపడే కుర్రాడిగా.. ఆ తర్వాత రాజ్యం కోసం యువరాణి ప్రేమను వదిలేసే సైనికుడిగా.. ప్రేమ కొంతకాలమే బాగుంటుందని చెప్పే లవర్ బాయ్‏గా అలరించాడు. ఇప్పటికే ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేసి నిరూపించుకున్నాడు చరణ్. మెగా వారసుడిగా .. చిరంజీవి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ కోసం వేయ కళ్లతో వెయిట్ చేస్తున్నారు అభిమానులు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.🎥✨

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page