top of page

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌..

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌ అయ్యారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్‌ ఖాన్ ను పాక్ రేంజర్లు మే 09వ తేదీ మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఇస్లామాబాద్‌ హైకోర్టులో హాజరుపర్చిన తరువాత ఇమ్రాన్‌ను అరెస్ట్ చేశారు.


ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌ నేపథ్యంలో కోర్టు దగ్గర గొడవలు జరిగాయి. ఇమ్రాన్‌ లాయర్‌కు ఈ గొడవలో తీవ్రగాయాలయ్యాయి. అనంతరం భారీ భద్రతా సిబ్బంది మధ్య ఇమ్రాన్ ను రహస్య ప్రాంతానికి తరలించారు.ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన్ను అరెస్టు చేయలేదు. ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతోపాటు కోర్టులో కూడా ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో ఇంతకాలం ఆయన్ను అరెస్టు చేయలేదు.

 
 
bottom of page