ఈ ఎన్నికల్లో బాబును గెలిపించిన బ్రహ్మాస్త్రాలు ఇవే..
- MediaFx
- Jun 5, 2024
- 1 min read
ఏపీలో ఎన్నికల యుద్ధం హోరాహోరీ జరిగింది. కౌంటింగ్‌లో మాత్రం వార్ వన్‌సైడ్ అయిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చంద్రబాబు నాయకత్వంలో వైసీపీని గాలికి ఎగిరేసింది. చంద్రబాబు వైసీపీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నడంలో, మూడు పార్టీలను ఒకే తాటిపై నడిపి, సూపర్ విక్టరీ కొట్టడంలో తన చాతుర్యాన్ని చూపించారు.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వైసీపీపై బలమైన వ్యూహాలు వాడారు. వైసీపీ సంక్షేమ పథకాలకు ప్రతిస్పందనగా సూపర్ సిక్సర్ పథకాలను ప్రవేశపెట్టారు: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆర్థిక సాయం, "తల్లికి వందనం" పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఈ సంక్షేమ వజ్రాలు వైసీపీ నవ రత్నాలను కోసేశాయి.
ప్రచారం పీక్స్ కు చేరుకున్నాక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే బ్రహ్మాస్త్రాన్ని వైసీపీపై ప్రయోగించారు. "మీ భూములను జగన్ లాక్కుంటారు, నేను అధికారంలోకి వచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేస్తా" అనే ప్రచారం బలంగా తీసుకెళ్లగలిగారు. ఇది వైసీపీకి భారీగా డ్యామేజ్ చేసింది. చంద్రబాబు ప్రయోగించిన సూపర్ సిక్సర్లు, ల్యాండ్ టైటిలింగ్ అస్త్రాలతో వైసీపీ ఘోర పరాజయం పాలైంది.