అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి సంక్షేమాన్ని నమ్మిన జగన్‌కు ఎదురుదెబ్బ
- MediaFx
- Jun 5, 2024
- 1 min read
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. సంక్షేమ పథకాలపై ఆధారపడి ఓట్లు సాధించలేకపోయింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపై బాగా నమ్మకంతో ఉన్నారు కానీ అభివృద్ధిని విస్మరించారు. ఇది పెద్ద సమస్యగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు జగన్‌కు షాకిచ్చాయి. 2019 నుంచి సంక్షేమంపై దృష్టి పెట్టిన వైఎస్ఆర్‌సీపీ.. ఈసారి నవ రత్నాలు ప్లస్ పేరుతో వచ్చింది. అయితే ఓట్లను మాత్రం సాధించలేకపోయింది.
సామాజిక పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, రైతు భరోసా, అమ్మఒడి, ఫీజు రియింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు నేరుగా జమ చేశారు. అయితే, ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఊహించని షాకిచ్చాయి.
YSRCP నాయకులు కనీసం సెంచరీ సాధిస్తామని అనుకున్నారు కానీ భారీ ఝలక్ తిన్నారు. సంక్షేమాన్ని నమ్ముకున్న సీఎం జగన్ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శలు ఉన్నాయి. గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయారని విమర్శలు ఉన్నాయి. వాలంటీర్ల ఉద్యోగాలే పెద్ద ఉద్యోగాలన్నట్లు హడావిడి జగన్ ఓటమికి కారణమయ్యాయి. పంచాయతీలకు నిధుల విషయంలో నిర్లక్ష్యం చేశారని వైఎస్ఆర్‌సీపీ సర్పంచులు ఆరోపించారు. సంక్షేమం పథకాలు అమలు చేసినా కనీసం ఒక్క పరిశ్రమను కూడా ఏపీకి తీసుకురాలేదని విపక్షాలు విమర్శించాయి. ఎన్నికలకు ముందు విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మూడు రాజధానుల అభిప్రాయం కూడా వైఎస్ఆర్‌సీపీని తీవ్రంగా దెబ్బతీసింది.