‘ఈగల్’ మూవీ రివ్యూ.. రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మెప్పించిందా..?🎥🎞️
- Suresh D
- Feb 9, 2024
- 1 min read
సూర్య వర్సెస్ సూర్య తర్వాత దాదాపు పదేళ్ల గ్యాప్ తీసుకుని యంగ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా ఈగల్. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం సంక్రాంతికి రావాల్సి ఉన్నా.. మిస్ అయిపోయింది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం..🎥🎞️
‘ఈగల్’ మూవీ రివ్యూ: జీరో ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్ళిన సినిమాలు సర్ప్రైజ్ చేస్తే భలే కిక్ ఉంటుంది.. ఈగల్ చూసిన తర్వాత చాలా మంది ఆడియన్స్‌కు బహుశా ఇదే కిక్ వస్తుందేమో..? రవితేజ గత సినిమాల ప్రభావమో.. లేదంటే సంక్రాంతికి వాయిదా పడటమో కారణం తెలియదు కానీ ఎందుకో దీనిపై భారీ అంచనాలు అయితే లేవు. ఇదే ఈగల్ సినిమాకు ప్లస్ అయింది. ఫస్టాఫ్ వరకు కూడా రవితేజ ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నాడో అర్థమవుతుంది. ఏముంది ఇందులో.. కథలో కన్ఫ్యూజన్.. ఎమోషన్ లేని ఎలివేషన్స్ తప్ప అనిపిస్తుంది. ఫస్టాఫ్ దాదాపు గంట 20 నిమిషాలుంటే.. ప్రతీ 10 నిమిషాలకు ఓసారి హీరో ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. చూస్తున్నపుడు రవితేజ కేజియఫ్‌లా అనిపిస్తుంది.. ఎలివేషన్స్ పరంగా మాత్రమే. దీన్ని ఒకే కథలా కాకుండా.. ఎపిసోడ్స్ వైజ్‌గా రాసుకున్నాడు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని. ఇంటర్వెల్ వరకు నెమ్మదిగానే లాక్కొచ్చాడు. మధ్యలో అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, మిర్చి కిరణ్‌తో కామెడీ ట్రాక్ పెట్టారు. అది కొంతవరకు మాత్రమే మెప్పిస్తుంది. కీలకమైన సెకండాఫ్ మాత్రం అదిరిపోయింది. కావ్య తపర్ ఎపిసోడ్ కాస్త స్లో అనిపించినా.. యాక్షన్ బ్లాక్స్ మాత్రం దిమ్మ తిరిగిపోయాయి. ముఖ్యంగా హౌజ్ ఎపిసోడ్, అమ్మవారి ఎపిసోడ్స్ అయితే మాటల్లేవు.. విజిల్స్ మాత్రమే. ఈగల్ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ యాక్షన్ ఎపిసోడ్స్.. కార్తిక్ ఘట్టమనేని వాటిని డిజైన్ చేసిన తీరు చాలా బాగుంది. అర్హత ఉన్న వాడి చేతిలోనే ఆయుధం ఉండాలి.. కథ చాలా సింపుల్.. దీని చుట్టూనే కథ అల్లుకున్నాడు కార్తిక్ ఘట్టమనేని.. ఆయుధమే కథ కాబట్టి యాక్షన్ సన్నివేశాలే ఈ సినిమాకు ప్రాణం. సినిమా అంతా రవితేజ హీరోయిజంపైనే నడపాలని ఫిక్సైపోయాడు. ఈ క్రమంలోనే ప్రతీ సీన్ ఎలివేషన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే కొన్నిసార్లు మాత్రమే అది వర్కవుట్ అయినట్లు కనిపించింది. అక్రమ ఆయుధాలు చెడ్డవాళ్ల చేతుల్లోకి వెళ్తే.. అది అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి.. వాళ్లను ఎలాగైనా అడ్డుకోవాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేసాడు కార్తిక్. అందులో దాదాపు 70 శాతం సక్సెస్ అయ్యాడు. అయితే స్క్రీన్ ప్లే లోపాలు, ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ కారణంగా ఈగల్ రేంజ్ కాస్త తగ్గింది.. లేదంటే ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచుండేది.🎥🎞️