షారూక్ ఖాన్ ‘డంకీ’ సినిమా నుంచి ‘ఓ మాహీ’ ప్రమోషనల్ సాంగ్ 🎵🎉
- Suresh D
- Dec 16, 2023
- 1 min read
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ డిసెంబర్ 21న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే డంకీ డ్రాప్ 1లో విడుదలైన వీడియో, డంకీ డ్రాప్ 2లో విడుదలైన ‘లుట్ పుట్ గయా..’ పాట, డంకీ డ్రాప్ 3లో విడుదలైన ‘నికలే ది కబీ హమ్ ఘర్ సే..’ పాట, డంకీ డ్రాప్ 4లో రిలీజైన ట్రైలర్‌తో సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రోజు రోజుకీ ఈ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం మేకర్స్ డంకీ డ్రాప్ 5 అంటూ ‘ఓ మాహీ..’ అనే ప్రమోషనల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.🎵🎉