ఫైటర్ నుంచి షేర్ కుల్ గయే సాంగ్ రిలీజ్.. హృతిక్, దీపికా రొమాన్స్ అదుర్స్🎵🎉
- Suresh D
- Dec 16, 2023
- 1 min read
బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ ఏరియల్ యాక్షన్ డ్రామా మూవీ ఫైటర్. ఈ సినిమాకు బాలీవుడ్‌లో బ్యాంగ్ బ్యాంగ్, వార్, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు అందించిన యువ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం తెరకెక్కిస్తున్నాడు.సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫైటర్ మూవీ నుంచి తాజాగా "షేర్ కుల్ గయే" సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనె డాన్స్ మూమెంట్స్ ఫాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి. సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.🎵🎉