డాన్ 3 షారూఖ్ స్థానంలో రణ్‌వీర్ సింగ్..🎬🎥
- Suresh D
- Aug 9, 2023
- 1 min read
బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీగా నిలిచింది `డాన్` మూవీ. షారూఖ్ ఖాన్ హీరోగా ఫరాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. `డాన్`, `డాన్ 2` చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. స్టయిలీష్ యాక్షన్ థ్రిల్లర్‌గా మెప్పించాయి. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మరో సీక్వెల్ రాబోతుంది. తాజాగా `డాన్ 3`ని ప్రకటించింది యూనిట్. అయితే ఇందులో షారూఖ్ స్థానంలో రణ్‌బీర్ సింగ్ హీరోగా నటిస్తుండటం విశేషం. రణ్‌వీర్ సింగ్ ట్విట్టర్ ద్వారా దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియోని పంచుకున్నారు. 🎥