ఇక వార్ టైం అంటోన్న పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు టీం..
- MediaFx

- Aug 16, 2024
- 1 min read
సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తున్నాయని తెలిసిందే. తాజా అప్‌డేట్‌తో ఇది నిజమేనని అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ చిత్రీకరణ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ మొదలు కానుంది.
కొత్త షెడ్యూల్ ఎపిక్ వార్ సీక్వెన్స్‌తో మొదలు కానుందని తెలియజేశారు మేకర్స్. ఇంతకీ షూటింగ్ ఏ రోజు షురూ అవుతుంది.. మరి పవన్ కల్యాణ్ ఎప్పుడు షూట్‌లో జాయిన్ అవుతాడనేది క్లారిటీ రావాల్సి ఉంది. హరిహరవీరమల్లు టీంలోకి పాపులర్ బాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్‌కు స్వాగతం పలుకుతూ ఇటీవలే అప్‌డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పవన్ కల్యాణ్ మరోవైపు సుజిత్ దర్శకత్వంలో ఓజీ (They Call Him OG), హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా చేస్తున్నాడని తెలిసిందే. వీటికి సంబంధించిన వార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.












































