top of page

మెట్రోలో రెచ్చిపోతున్న యువత, పెద్దలకు మాత్రమే అనే బోర్డు పెట్టాలేమో అంటున్న నెటిజన్లు !!

ఢిల్లీ మెట్రో రోజు రోజుకు బూతులు బండిలా మారిపోతోంది. రోజుకో అసభ్యకరమైన వీడియో వైరల్‌ అవుతోంది.


ఢిల్లీ మెట్రో ఎక్కాలంటే జనం భయపడిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి సీన్లు చూడాల్సి వస్తుందో అన్న సందేహం ప్రయాణికుల్లో కనిపిస్తోంది. మొన్నటికి మొన్న కొందరు యువత చేసిన రచ్చపై చర్చ జరుగుతుండగానే ఇప్పుడు మరో జంట రెచ్చిపోయింది.

ఢిల్లీ మెట్రోలో ఓ జంట మైమరిపోయి చుంబన క్రీడల్లో మునిగిపోయింది. బ్లూ లైన్‌లో వెళ్లే ట్రైన్‌లో యువ జంట రెచ్చిపోయింది. ప్రియుడి ఒడిలో పడుకొని ఉన్న యువతికి ముద్దులు పెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకటి రెండు సార్లు కాదు... ట్రైన్ దిగే వరకు వాళ్లు అదే పనిలో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page