రైతుల ఖాతాల్లో పంట నష్టం డబ్బులు
- Sudheer Kumar Bitlugu
- May 2, 2023
- 1 min read

అకాల వర్షాల్లో పంట నష్టపోయిన రైతులకు ఊరట లభించనుంది. వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. పంట నష్టం సాయం కింద రూ. 151.6 కోట్లను విడుదల చేస్తూ మంత్రి హరీష్ రావు సంతకం చేశారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాల్లో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ సందర్శించారు. నష్టపోయిన రైతులకు పరామర్శించిన ఆయన ఎకరాకు రూ.10 వేలను ప్రకటించారు. తాజాగా ఆర్థికశాఖ ఆమోదం తెలపడంతో త్వరలో రైతులకు డబ్బులు అందనున్నాయి.