top of page

ఈరోజు ఈ 3 రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు..! 🌌🔮

ఈరోజు ద్వాదశ రాశులపై శ్రవణా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు శూల యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా వృషభం, కర్కాటకం, తులా రాశుల వారికి శుభ ఫలితాలు వినిపించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది.🌌🔮

ree

మేష రాశి ఫలితాలు

ఈ రాశి వారిలో రాజకీయ రంగాలలో పని చేసే వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీ కుటుంబంలోని వ్యక్తులతో ఏదైనా ముఖ్యమైన సమస్యను చర్చించొచ్చు. మీ కుటుంబంలోని వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాల్లో స్పష్టత ఉంటుంది. మీ మనసులోని భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. మీరు వ్యక్తిగత విషయాల్లో పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. మీ బాధ్యతలను నెరవేర్చడంలో ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టరు.

వృషభ రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీ ఆలోచన, అవగాహనతో అన్ని పనులు పూర్తవుతాయి. మీకు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. మీరు ఎవరి నుంచి అయినా రుణం తీసుకుంటే, దాన్ని తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు. ఏదైనా ముఖ్యమైన లక్ష్యం పూర్తి చేయడంతో మీ ఆనందానికి అవధులనేవి ఉండవు.

మిధున రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. మీ పనులన్నీ ఓపికగా చేయాలి. మీ అతిథులను స్వాగతించడంలో బిజీగా ఉంటారు. మీ కోరికలను నెరవేర్చుకోవడానికి మీరు కొన్ని వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఓపికగా ఉండాలి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెండింగులో ఉన్న ఏదైనా పనిని పూర్తి చేయొచ్చు. మీరు మీ పిల్లల నుంచి ఏదైనా పనిని ఆశించినట్లయితే, దానిని కచ్చితంగా నెరవేరుస్తారు.

కర్కాటక రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుంది. మీరు ఎవరికైనా ఏదైనా సలహా ఇస్తే, వారు కచ్చితంగా దాన్ని అమలు చేస్తారు. మీరు మీ పిల్లల కెరీర్ గురించి కొంచెం ఆందోళన చెందుతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలు పరిష్కరించబడతాయి. మీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

సింహ రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారు ఈరోజు చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. దీంతో మీరు సంతోషంగా ఉంటారు. ఈ సాయంత్రం మీరు మీ తల్లిదండ్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. మీ కుటుంబంలో చిన్న పిల్లలతో సరదాగా గడుపుతారు. వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో మతపరమైన సమావేశానికి హాజరవుతారు.

కన్య రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఏదైనా సమస్యలుంటే, వాటి పరిష్కారం కోసం రుణాలు తీసుకోవచ్చు. ఈరోజు ఎవరి మాటల ప్రభావానికి గురికాకుండా ఉండాలి. వ్యాపారులకు ఈరోజు ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవచ్చు. విదేశాల్లో వ్యాపారం చేసే వారు పెద్ద ఒప్పందాలు చేసుకోవచ్చు. ఈ సాయంత్రం మీ ఇంటికి అతిథి రావొచ్చు.

తుల రాశి వారి ఫలితాలు


ఈ రాశి వారు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో దూర ప్రయాణానికి వెళ్తారు. విద్యార్థులు కష్టపడి పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఈరోజు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, దీని వల్ల భవిష్యత్తులో మీరు దాని నుంచి ప్రయోజనం పొందొచ్చు. మీరు పిల్లల ఆరోగ్యం గురించి కూడా అప్రమత్తంగా ఉండాలి


వృశ్చిక రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారు ఈరోజు ఇతరులకు సహాయం చేయడానికి అవకాశం వస్తుంది. మరోవైపు ఈరోజు సీజనల్ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు సీనియర్ సభ్యుల నుంచి సలహా తీసుకోవాలి. ఈరోజు మీరు సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించొచ్చు.

ధనస్సు రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. మీరు అనేక పనులు ఒకేసారి చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా ఏ పనులు చేయాలో ఆలోచించుకోండి. మీ కుటుంబ సభ్యుల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. మీకు, మీ పిల్లలకు మధ్య కొనసాగుతున్న వివాదాల కోసం కుటుంబ సభ్యుల నుంచి సహాయం పొందొచ్చు. ఈరోజు మీరు ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశం ఉంది.


మకర రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారు ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే, వాటిలో మీరు శుభ ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడంలో విజయవంతం అవుతారు. ఈరోజు మీరు ఎలాంటి పనులను వాయిదా వేయకండి. ఎందుకంటే చాలా కాలంగా అవి పెండింగులో పడొచ్చు. మరోవైపు ఈరోజు రోజువారీ అవసరాలను తీర్చడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు ఏదైనా పరీక్షకు దరఖాస్తు చేయాలని నిర్ణయించుకుంటే, వాటిని సులభంగా తయారు చేయొచ్చు.

కుంభ రాశి వారి ఫలితాలు

ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా అది పూర్తవుతుందా లేదా అని ఆలోచించకుండా చేస్తారు. అయితే మీ మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ప్రత్యర్థుల కారణంగా కొంచెం ఆందోళన చెందుతారు. తెలియని వ్యక్తులతో లావాదేవీలు చేయాల్సి వస్తే, చాలా జాగ్రత్తగా చేయాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.


మీన రాశి


మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆధ్యాత్మిక, దైవ కార్యాలలో పాల్గొంటారు. కుటుంబ వృద్ధి, అధిక ధనాన్ని నిల్వచేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ సాంఘిక ప్రవర్తన అందరికీ మార్గదర్శకమవుతుంది. ధార్మిక సంస్థలకు విరాళాలిస్తారు. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.


 
 
bottom of page