top of page

🔒👮🚓 ఈటల, అర్వింద్ భద్రత పెంపుపై కేంద్రం సంచలన నిర్ణయం! 🔒👮🚓

తెలంగాణ బీజేపీకి చెందిన ఇద్దరు కీలక నేతలకు కేంద్రం భద్రత పెంచనుంది. ఈటల రాజేందర్ (Etela Rajender), ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind)ఈ ఇద్దరికీ కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తో పాటు సిఆర్పిఎఫ్ (CRPF) భద్రత కల్పించనుంది.

ree

ఈటల రాజేందర్ (Etela Rajender) కు వై ప్లస్ కేటగిరి, ధర్మపురి అర్వింద్ కు వై కేటగిరి భద్రతను కేంద్రం కేటాయించింది. దీనితో ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తో పాటు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ (CRPF)బలగాలు సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇక అర్వింద్ కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ (CRPF) బలగాల రక్షణ కల్పించనున్నాయి. ఇటీవల ఈటల రాజేందర్ (Etela Rajender) తనకు ప్రాణహాని ఉందని..తనను చంపేందుకు రూ.20 కోట్ల రూపాయల సఫారీ ఇచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తనను చంపేందుకు చూస్తున్నారని ఈటల (Etela Rajender) ఇటీవల ఆరోపించిన నేపథ్యంలో ఈ భద్రతను పెంచినట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) ఇంటిపై ఎమ్మెల్సీ కవిత అనుచరులు దాడి చేశారు. అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న కవిత అనుచరులు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలో ఆయనకు వై కేటగిరి భద్రతను కేంద్రం కేటాయించింది.ఈరోజు సీఆర్పీఎఫ్ బృందం ఈటెల, అర్వింద్ ఇంటికి వెళ్లనున్నారు.

 
 
bottom of page