top of page

🌦️🌍దక్షిణాదిలో చినుకులే..! ఉత్తరాదిలో వరదలు.. ☔️🌈

ఉత్తరభారతం వరదల ధాటికి విలవిలలాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా , జమ్మూ కశ్మీర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌ గుజరాత్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వేర్వేరు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తరాదిలో భారీవర్షాల కారణంగా 20 రైళ్లను కూడా రద్దు చేశారు. ఢిల్లీలో కుంభవృష్టి కారణంగా జనజీవితం స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందు పడుతున్నారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. భారీవర్షాల కారణంగా ఢిల్లీలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది. 🚗🚧


 
 
bottom of page