సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోందని చెల్లిని చంపిన అన్న..📲👬💔
- Suresh D
- Jul 26, 2023
- 1 min read
అన్నాచెల్లెల అనుబంధం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అయితే.. ఓ అన్న తాజాగా దారుణానికి పాల్పడ్డాడు. చెల్లి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుందని ఆగ్రహంతో రగిలిపోయాడు. ఇంట్లో ఉన్న రోకలి బండతో ఆమెను కొట్టి చంపాడు.

అన్నాచెల్లెల అనుబంధం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అయితే.. ఓ అన్న తాజాగా దారుణానికి పాల్పడ్డాడు. చెల్లి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుందని ఆగ్రహంతో రగిలిపోయాడు. ఇంట్లో ఉన్న రోకలి బండతో ఆమెను కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రాజీవ్ నగర్ లో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ పెడుతుందని అన్న సొంత చెల్లిని రోకలి బండతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఇల్లందు మండలం రాజీవ్ నగర్‌కు చెందిన అజ్మీర సింధు. మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అయితే, ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తోంది. అయితే, ఇది అన్న హరిలాల్ ఇష్టం లేదు.. అతను చాలాసార్లు ఇదే విషయంపై పలు మార్లు హెచ్చరించాడు.ఎంత వద్దని చెప్పిన వినట్లేదన్న కోపంతో హరిలాల్ రోకలి బండతో సింధు తలపై కొట్టాడు. దీంతో ఆమె మరణించింది. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. క్షణికావేశంలో అన్న చేసిన పనికి ఓ చెల్లి ప్రాణం బలైంది.📷🚓💔











































