top of page

‘బిగ్ ట్విస్ట్.. ఉస్తాద్ నుంచి క్రేజీ అప్డేట్.!😮

‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కొన్నాళ్లుగా ఆయన నటిస్తోన్న సినిమాల షూటింగ్స్‏కు బ్రేక్ పడింది.

అయితే ఇప్పటికే పవన్ చేతిలో ఉన్న సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ క్రమంలోనే మూవీ అసలు ఉంటుందా? ఉండదా? అనే డౌట్స్ అందర్లో కలిగాయి. అయితే ఆ డౌట్‌కే తాజాగా క్లియర్ చేశారు ఈ మూవీ మేకర్స్‌. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి త్వరలో ఊహించని అప్డేట్ రాబోతుందంటూ తమ సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఉస్తాద్ మేకర్స్. Expect the Unexpected from UBS The Film అంటూ తమ ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే ఇన్నాళ్లు ఉస్తాద్ సినిమా గురించి ఎలాంటి పోస్ట్ చేయకుండా సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్.. ఇప్పుడు సడెన్ గా అప్డేట్ ఇస్తాము అని ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ షాకవుతూనే ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు ఎలాంటి అప్డేట్ ఇస్తారు ?..వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఉస్తాద్ అప్డేట్ అంటూ పవన్ అభిమానులను ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. 🌟’

 
 
bottom of page