top of page

బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ: కేసీఆర్‌


ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్‌ 9) సందర్భంగా ఆయన సేవలను బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR) స్మరించుకున్నారు. బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించారు. తెలంగాణ ఉద్యమంలో కాళోజీ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను బయలుదేరిన నాడు నిండు మనసుతో కాళోజీ దీవించారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ స్ఫూర్తి కొనసాగే దిశగా ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. కాళోజీ పురసారాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ భాష, సాహిత్యాలలో విశేషంగా కృషి చేసిన సాహితీవేత్తలను గౌరవించుకుంటున్నాం అని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టామని, వరంగల్‌లో కాళోజీ కళాకేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page