top of page

సింహానికి భయం రుచిచూపించిన హిప్పో.. వీడియో చూస్తే అవాక్కే..!


సింహం అడవికే రారాజు. దాన్ని చూస్తే అడవిలోని అన్ని జంతువులు ప్రాణభయంతో పరిగెత్తాల్సిందే. సింహం కంటపడిన ఏ జీవి బతికి బట్టకట్టలేదనే చెప్పాలి. అందుకే అంత దూరంగా సింహాన్ని చూసిన కూడా ఒంట్లో వణుకుపుడుతుంది. గర్జన విన్నా కూడా ఆమడ దూరం పరిగెడతాం. అలాంటి క్రూరజంతువు సింహం ఏ ఇతర జంతువుకూ భయపడదు. అలాంటి ఆ సింహానికే భయం అంటే ఏంటో రుచిచూపించింది ఓ హిప్పో. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్‌ వీడియో ఆఫ్రికాకు చెందినదిగా తెలిసింది. ఆఫ్రికాలోని షెంటన్ సఫారిస్ కైంగో క్యాంప్‌ లో గల లుయాంగ్వా నదిలో ఒక సింహం నీటిలో హాయిగా ఈదుతూ ఎంజాయ్‌ చేస్తోంది. అదే సమయంలో నదిలో ఓ హిప్పో కూడా ఉంటుంది. సింహాన్ని చూసిన హిప్పో దాన్ని భయపెట్టాలనుకుందో ఏమోగానీ,.. మెల్లగా దాని వెనకాల వచ్చి వెంబడిస్తుంది. పలుమార్లు సింహంపై దాడి చేస్తుంది. దీంతో సింహం ఉలిక్కిపడుతుంది. ప్రాణ భయంతో అక్కడి నుంచి వేగంగా ఈదుకుంటూ నది బయటకు వెళ్లిపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page