top of page

రాహుల్‌ గాంధీ ‘పప్పు’ కాదు.. : శామ్‌ పిట్రోడా


ree

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శామ్‌ పిట్రోడా (Sam Pitroda) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ ‘పప్పు’ (Pappu) కాదని.. ఆయనో వ్యూహకర్త అని వ్యాఖ్యానించారు. అమెరికా టెక్సాస్‌లో ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో పిట్రోడా ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పప్పు కాదు.. ఉన్నత విద్యావంతుడు, వ్యూహకర్త’ అని అన్నారు. ‘ఆయనకు (రాహుల్‌ను ఉద్దేశించి) ఓ విజన్‌ ఉంది. ఆయన ఇమేజీని దెబ్బతీసేందుకు బీజేపీ రూ.కోట్లు వెచ్చించి ప్రచారం చేయిస్తోంది. నేను మీకో విషయం చెప్పాలి. రాహుల్‌ పప్పు కాదు.. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. ఏ అంశంపైనైనా లోతుగా ఆలోచించే వ్యూహకర్త. ఆయన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు’ అని పిట్రోడా వ్యాఖ్యానించారు.

కాగా, రాహుల్‌ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌ తొలిసారి యూఎస్‌ పర్యటనకు వెళ్లారు. తన పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తున్నారు. విద్యావేత్తలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు.


bottom of page