ప్రాణాలు తీసుకోవాలని అటల్ బ్రిడ్జి పైకి ఎక్కింది.. ఆ తర్వాత ఊహించని సీన్..
- MediaFx

- Aug 17, 2024
- 1 min read
ములుంద్‌కు చెందిన రీమా పటేల్ ములుంద్ నుంచి క్యాబ్‌ను బుక్ చేసుకుంది.. ఈ క్రమంలో అటల్ సేతు వంతెన దగ్గర ఆపమని కోరింది.. అనంతరం రెయిలింగ్ దగ్గరకు వెళ్లగా.. అప్రమత్తమైన డ్రైవర్ ఆమె సరిగ్గా దూకే క్రమంలో జుట్టు పట్టుకుని ఆమెను ఆపాడు.. అప్పుడే సెకన్లలోనే అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు ఆమెను రక్షించారు.. అటల్ సేతు బ్రిడ్జ్ CCTV ఫుటేజ్‌లో, క్యాబ్ డ్రైవర్ మహిళ జుట్టును పట్టుకుని కనిపించాడు.. దీంతో పోలీసులను అక్కడి అధికారులు అప్రమత్తం చేశారు.. సరిగ్గా ఆమె దూకే సమయంలో అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ సిబ్బంది రైలింగ్‌పైకి ఎక్కి మహిళను రక్షించారు.. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..












































