పెంపుడు కుక్కను తరుముతూ వచ్చిన ఎలుగుబంటి.. ఆ మహిళ ఏం చేసిందంటే..?
- MediaFx

- Aug 17, 2024
- 1 min read
కొంతమంది.. పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లా ట్రీట్ చేస్తారు. వాటికి చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు. వాటిని కాపాడుకునేందుకు ప్రాణాలను కూడా లెక్కచేయరు. తాజాగా ఓ మహిళ తన పెట్ డాగ్ ప్రాణాలను కాపాడేందుకు.. అడవి ఎలుగుబంటితో పోరాడింది. ఈ ఘటన మొత్తం ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది, దీనికి సంబంధించిన ఫుటేజీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. చంపేవాడి కంటే రక్షించేవాడు గొప్పవాడని అంటారు. నేటి కాలంలో, మరో మనిషికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. కానీ ఈ వైరల్ క్లిప్ చూసిన తర్వాత మీ ఆలోచన మారుతుంది. ఎందుకంటే ఒక అమ్మాయి తన పెంపుడు కుక్కను రక్షించడానికి అడవి ఎలుగుబంటితో పోరాడింది. వైరల్ అవుతున్న వీడియోలో, ఆ మహిళ ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటి పెరట్లోకి వచ్చింది. ఆ సందర్భంలో పెంపుడు కుక్కను వేగంగా ఓ అడవి ఎలుగుబంటి తరుముతూ రావడాన్ని గమనించింది. ఇది చూసిన ఆ మహిళ తన ప్రాణాలను పట్టించుకోకుండా ఎలుగుబంటి వెంట పరుగెత్తుకుంటూ వెళ్లి.. దాన్ని తరిలిమికొట్టే ప్రయత్నం చేసింది. కానీ ఎలుగుబంటి అగ్రెసీవ్‌గా ఉండటంతో.. ఆమె కూడా భయపడింది. ఇంతలో అరుపులు విని ఆ మహిళ భర్త కూడా పరుగున వచ్చి ఎలుగుబంటిని భయపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాలా చేశాడు.












































