top of page

కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్ లాంచ్ చేసిన ఏపీ సీఎం..

ree

పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారకరామారావు గారి పేరిట జరగనున్న "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్" వేడుక జూన్ 29, 2024న హైదరాబాదు హోటల్ దసపల్లా లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం!

కళావేదిక (R.V. రమణ మూర్తి గారు) మరియు రాఘవి మీడియా ఆధ్వర్యంలో ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటివల ఈ వేడుక పోస్టర్ ను ఆవిష్కరించారు. ఆయన సినీ ప్రముఖులు, NTR అభిమానులను ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

సినిమా రంగంలోని ప్రతిభావంతుల సేవలను గుర్తించేందుకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. చంద్రబాబు నాయుడు ఈ అవార్డ్స్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

జూన్ 29న జరగబోయే ఈ గ్రాండ్ ఈవెంట్‌ లో సినీ మరియు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి అవుతాయి.

 
 

Related Posts

See All
bottom of page