అమ్మపై అనుపమ కంప్లైంట్.. 👥
- Suresh D
- Mar 13, 2024
- 1 min read
అనుపమ పరమేశ్వరణ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ వేస్తూనే ఉంటుంది. తాజాగా అనుపమ తన తల్లి గురించి చెబుతూ వేసిన పోస్ట్ అందరినీ నవ్వించేస్తోంది. అమ్మగా ఉన్నప్పుడు ఒకలా.. అమ్మమ్మలా మారిన తరువాత ఒకలా ఉంటారన్న సంగతి తెలిసిందే. కూతురితో అమ్మ కాస్త కోపంగా ఉంటుంది.. కానీ మనవరాండ్లతో మాత్రం ప్రేమగా ఉంటుంది.. వారేం చేసినా కూడా చూస్తూ అలా ఉంటారు.. ఇది ఎక్కడైనా సహజమే. ఇదే విషయాన్ని ఓ మీమ్‌లో చూపించారు. ఆ మీమ్‌ను అనుపమ షేర్ చేసింది. ఇన్ స్టా స్టోరీలో ఈ మీమ్ పెడుతూ.. తన అమ్మకి ట్యాగ్ చేసింది. అనుపమ షేర్ చేసిన ఈ మీమ్ మీద నెటిజన్లు బాగానే స్పందించారు. అందరూ ఇలానే ఉన్నారా? ఏంటి? మా అమ్మ కూడా ఇంతే.. అంటే ఇది యూనివర్సల్ ప్రాబ్లమా?.. అంటూ ఇలా ఫన్నీగా కామెంట్లు పెట్టారు.








































