సోహెల్ పరువుతీసిన బుల్లెట్ భాస్కర్.. 🎥
- Suresh D
- Mar 13, 2024
- 1 min read
సోహెల్ అలా మైక్ ముందు ఏడుస్తూ నా సినిమాను చూడటం లేదు.. చూడండి.. 🤔 బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేశారు కదా? ఇప్పుడు చేయడం లేదు ఎందుకు అని ఇలా ఎమోషన్‌లో ఏదేదో అనేశాడు. పక్కనే ఉన్న అవినాష్ కాస్త సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ సోహెల్ మాత్రం ఆ క్షణంలో ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. ఇక ఆ వీడియో ఆ టైంలో బాగానే ట్రోల్ అయింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవ్వడం కామన్ అనుకుంటే.. ఇప్పుడు బుల్లితెరపై ఏకంగా స్పూప్ కూాడా చేేసేశారు. బుల్లెట్ భాస్కర్ తాజాగా సోహెల్ ఎమోషనల్ వీడియో మీద స్కిట్ వేశాడు. బుల్లెట్ భాస్కర్, నరేష్ కలిసి సోహెల్ అవినాష్‌ను ఇమిటేట్ చేశారు. ఇలా వాళ్లలో వాళ్లే స్పూప్‌లు, ట్రోల్ చేస్తుంటే.. 👥 బయట జనాలు ఇంకెంత చేస్తుంటారో చెప్పాల్సిన పని లేదు. సోహెల్ ఎమోషన్‌ను ఇలా బుల్లెట్ భాస్కర్ మాత్రం తన స్కిట్ కోసం కామెడీగా మార్చేశాడు. పైగా జడ్జ్‌లు ఇక ఇక పక పకా అంటూ నవ్వేయడం కొసమెరుపు. 😄








































