CSKకి మరో బిగ్ షాక్! 😱
- Shiva YT
- Mar 19, 2024
- 1 min read
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బౌలర్, బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ గాయపడినట్లు సమాచారం. శ్రీలంకతో సోమవారం నాటి మూడో వన్డే సందర్భంగా కండరాల నొప్పితో మైదానంలోనే విలవిల్లాడాడు. దీంతో ముస్తాఫిజుర్‌ను స్ట్రెచర్‌పై తీసుకువెళ్లారు. మరి ఐపీఎల్ ప్రారంభానికి అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది చూడాలి..! 🏏








































