top of page

చంద్రబాబు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా..!


సోమవారం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు స్థానిక మహిళలతో కాసేపు ముచ్చటించారు. టీడీపీ అధికారంలోకి రాగానే పింఛన్ నాలుగు వేలు చేస్తామని ప్రకటించారు. ఆయన అక్కడితో ఆగకుండా ఒకటో తేదీనే పింఛన్ మీ ఇంటికి ఇస్తామని తెలిపారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒకటో తేదీనే పింఛన్ ఇంటికి తీసుకువచ్చి మరీ ఇస్తున్నారు.ఇందులో చంద్రబాబు కొత్తగా ఇచ్చేది ఏముందని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.ఇక పింఛన్ రూ.4 వేలు పెంచుతామని చంద్రబాబు ప్రకటనలో కొత్తదనం లేదని సామాన్య ప్రజలు సైతం పెదవి విరుస్తున్నారు. జగన్ ఎన్నికల్లో హామీల్లో పింఛన్ పెంపుదల కూడా ఒకటని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో చంద్రబాబు కొత్తగా చెప్పింది ఏమీ లేదంటున్నారు. మొత్తానికి పింఛన్ పెంపుదలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీని ఇరాకటంలో పెట్టేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.మరి దీనిపై టీడీపీ శ్రేణలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page