top of page

పవన్‌పై ఎలాంటి కోపం లేదు.. జాలి తప్ప


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. ఇదివరకు నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలకు కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. 175 నియోజవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పారు. రెండోసారి గెలవడానికి గల కారణాలనూ ఆయన విశ్లేషించారు. ఈ ఇంటర్వ్యూలో జనసేన అధినేత, పిఠాపురం కూటమి అభ్యర్థి పవన్ కల్యాణ్‌ అంశం ప్రస్తావనకు వచ్చింది. పవన్ కల్యాణ్‌పై తమకు ఎలాంటి కోపం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. ఆయనపై జాలి మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. పవన్ అంటే జగన్ జాలి పడతామని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎదగడానికి పవన్ కల్యాణ్‌కు ఎంతో అవకాశం ఉందని సజ్జల పేర్కొన్నారు. ఆయన అభిమానులే ఆయనకు పునాది అని, దాన్ని వాడుకుని ప్రజలకు సేవ చేయొచ్చని చెప్పారు. ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా.. ఈ 10 సంవత్సరాల్లో పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారని అన్నారు. గెస్ట్ గానో, కాల్షీట్స్ తీసుకుని పని చేసే ఆర్టిస్ట్‌ గానో వ్యవహరిస్తోన్నారని సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబు కోసం కొవ్వొత్తిలాగా తన జీవితాన్ని కరిగించుకుంటోన్నాడని చెప్పారు.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page