top of page

లోక్ సభ ఎన్నికల బరిలో కంగన.. 🗳️

Updated: Mar 26, 2024



భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఐదవ జాబితాను ఆదివారం (మార్చి 24) విడుదల చేసింది. మొత్తం 111 మంది అభ్యర్థుల పేర్లను జాబితాలో చేర్చింది. ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ పేరు కూడా ఉంది. హిమాచల్‌లోని మండి నుంచి నటి కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపనున్నట్లు బీజేప ప్రకటించింది. కాగా బీజేపీకి బలమైన మద్దతుదారుల లిస్టులో కంగనా రనౌత్ పేరు తప్పకుండా ఉంటుంది. నరేంద్ర మోడీకి పలు సార్లు బహిరంగంగానే మద్దతు పలికిందామె. ఇక కంగనా నటనా ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం కూడా ప్రకటించింది. అప్పటి నుంచే ఆమె బీజేపీ తరఫున ఎన్నికల బరిలో దిగనుందని వార్తలు వచ్చాయి. కంగనా కూడా సమయమొచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానంది. ఇప్పుడిదే నిజమయ్యింది. 🇮🇳🗳️

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page