రాజభవనంలా ఉందే.. లీక్ చేసిన రష్మిక
- balaparasuram
- Sep 8, 2023
- 1 min read
అల్లు అర్జున్, రష్మిక మందన కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

🎬 పుష్ప ది రైజ్ అంటూ సుకుమార్ చేసిన మ్యాజిక్ నేషనల్ వైడ్‌గా వర్కౌట్ అయింది. 🪄 అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా మీదే తన ఫోకస్ అంతా పెట్టాడు. 🎥 రష్మిక మందన్న, అల్లు అర్జున్ జంటగా నటించిన ఈ మూవీ నార్త్‌లో ఎక్కువగా క్రేజ్ దక్కించుకుంది. హిందీ బెల్టులో వంద కోట్లు కొల్లగొట్టిన డబ్బింగ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలా పుష్ప మీద భారీ హైప్ వచ్చేసింది. ఇప్పుడు తెరకెక్కిస్తున్న సీక్వెల్ మీద వరల్డ్ వైడ్‌గా క్రేజ్ ఉంది. 🌍 అందుకే ఆ అంచనాలకు తగ్గట్టుగానే సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. 🎬 ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్‌లోనే జరుగుతోంది. 🎥 మొన్న డే విత్ అల్లు అర్జున్ అంటూ ఇన్ స్టాగ్రాం టీం వదిలిన వీడియోలో పుష్ప మేకింగ్ కనిపించింది. 📷 పుష్ప సెట్‌లోకి ఇన్ స్టాగ్రాం టీం అడుగు పెట్టింది. అక్కడ పుష్ప గాడి రూలుని కాస్త చూపించారు. 🚗 పుష్ప ది రూల్‌లో బన్నీ ఎలా కనిపించబోతోన్నాడు.. ఎంత హుందాగా కనిపించబోతోన్నాడో అందరికీ అర్థమైంది.











































