top of page

AIIMS లో అగ్ని ప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పాత ఓపీడీ భవనం లోని రెండో అంతస్తులో ఉన్న ఎండో స్కో పీ గదిలో మంటలు చెలరేగాయి. ఈ గది కింది అంతస్తులో ఎమర్జెన్సీ వార్డు కూడా ఉండటం తో రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఎయిమ్స్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎండోస్కో పి గదిలోని రోగులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు

ree

 
 
bottom of page