అతిలోక సుందరికి అరుదైన గౌవరం..🎥🎞️
- Suresh D
- Aug 14, 2023
- 1 min read
2018లో అతిలోక సుందరి శ్రీదేవి అకాల మరణం చెందడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను కలచివేసింది. దుబాయ్ లో జరిగిన ఓ వేడుక కోసం అటెండయిన శ్రీదేవి హోటల్ బాత్రూమ్ లో కాలు జారి మరణించారు. నేడు శ్రీదేవి 60వ పుట్టినరోజు సందర్భంగాసెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో నివాళులర్పించింది.మామ్ శ్రీదేవి బౌతికంగా మరణించినా కానీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ స్థిరంగా నిలిచి ఉంది. శ్రీదేవి నటవారసురాలు జాన్వ కపూర్ ఇప్పటికే పరిశ్రమలో క్రేజీ నాయికగా వెలిగిపోతోంది. తదుపరి ఖుషీ కపూర్ కథానాయికగా ఆరంగేట్రం చేస్తోంది. పాపా బోనీ కపూర్ ఆ ఇద్దరి కెరీర్ ని తీర్చిదిద్దేందుకు తనవంతు సహకారం అందిస్తున్నారు.🎥🎭
