top of page

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్


ree

హైదరాబాద్ వాహనదారులకు నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బల్కంపేటలో ఎల్లమ్మ కళ్యాణోత్సవం జరగడం వల్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట, గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట, ఫతేనగర్ తదితర ప్రాంతాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సూచించారు. భక్తుల కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. సహాయం కోసం 90102 03626కు ఫోన్ చేయవచ్చు.


 
 
bottom of page