పుచ్చకాయ తినకూడదు.. డాక్టర్ల సలహా !
- mahesh
- Apr 24, 2023
- 1 min read
వేసవి కాలంలో పుచ్చకాయ ని తినకుండా వుండలేం. కాని పుచ్చకాయ తినొద్దు అంటున్న డాక్టర్లు అసలు ఎందుకో తెలికుందాం.

పుచ్చకాయ లోవిటమిన్ సీ, ఐరన్, విటమిన్ బీ6, మెగ్నీషియం, షుగర్, డైటరీ ఫైబర్, సోడియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఐతే.. పుచ్చకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ 72గా ఉంది. అంటే.. ఇందులో సుక్రోజ్ చాలా ఎక్కువగా ఉన్నట్లు లెక్క. అంటే పుచ్చకాయ తింటే.. షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అందువల్ల కొంతమంది పుచ్చకాయ తినకూడదంటున్నారు నిపుణులు.

డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇందులోని సుక్రోజ్... గ్లూకోజ్‌గా మారుతుంది. అది రక్తంలో కలిసి.. షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోయేలా చేస్తుంది. ఇది వారికి సమస్య అవుతుంది.

పుచ్చకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్య ఉన్నవారికి ఇది సమస్య అవుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవద్దని డాక్టర్లు వారికి చెబుతుంటారు. కాబట్టి.. కిడ్నీ సమస్య ఉన్నవారు.. పుచ్చకాయలకు దూరంగా ఉండాలి

గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా పుచ్చకాయలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే.. పుచ్చకాయలోని అధిక పొటాషియం.. గుండె లయ (irregular heartbeat)ను దెబ్బతీయగలదు. అలాగే ఇతర గుండె సమస్యలు కూడా వస్తాయి.

కొంతమందికి పుచ్చకాయ పడదు. అలర్టీ వస్తుంది. అందులోని గుజ్జు, గింజలూ వారికి ఇబ్బంది కలిగిస్తాయి. దురద (itching), వాపు (swelling), ఊపిరి పీల్చడం కష్టమవుతుంది. అందువల్ల అలర్జీ అయ్యేవారు పుచ్చకాయలను తినకపోవడం బెటర్.

రక్తపోటు లేదా బీపీ (blood pressure)కి మందులు వాడేవారు, కొన్ని రకాల యాంటీబయోటిక్స్ మందులు వాడేవారు.. పుచ్చకాయను తినకూడదు. అందువల్ల ఇలాంటి వారు పుచ్చకాయను తినాలో వద్దో... సంబంధిత ఆరోగ్య నిపుణుల్ని కలిసి వారి సలహా తీసుకోవాలి.

అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నవారు పుచ్చకాయను తినవచ్చు. అలాగని ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తింటే.. విరేచనాల సమస్య రాగలదు. కొద్ది మొత్తంలో తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.