శుభవార్త చెప్పిన సమంత 🎥✨
- Suresh D
- Apr 2, 2024
- 1 min read
ఖుషీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సమంత..తన కొత్త సినిమా గురించి క్రేజీ ఆప్డేట్ ఇచ్చారు. బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సమంత .. తాజాగా సిరీస్‌కు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ టైటిల్‌ను ''హనీ, బన్నీ'' పెట్టినట్టు చిత్ర యూనిట్ తెలిపారు. తాజాగా సమంతకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ కొత్త సినిమాలో సమంతకు హీరోయిన్‌గా అవకాశం దక్కినట్టు సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో ఓ మూవీ చేయడానికి బన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అట్లీ వినిపించిన కథ నచ్చడంతో వెంటనే సమంత ఈ సినిమాను ఓకే చేసిందట. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమంత ఇలా తిరిగి సినిమాల్లో నటిస్తుండటంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఇలా మళ్లీ సినిమాల్లో నటించడం అభిమానులకు శుభవార్తే. 🎥✨