ఉప్పు ఎక్కువగా తింటే ఆ శక్తి తగ్గుతుందట..
- Suresh D
- Mar 31, 2024
- 1 min read
లైంగిక జీవితం సరిగా లేకపోవడం వల్ల చాలా మంది జంటలు విడిపోతారు. కోరికలు సరిగ్గా ఉండి ఆనందంగా గడపాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అందులో డైట్ కూడా ముఖ్యమే. కొన్ని ఫుడ్స్ తీసుకోవడం ఎంత మంచిదో.. కొన్నింటిని ఎక్కువగా తీసుకోకూడదు. అందులో ఉప్పు ఒకటి.
సోడియం..
ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది హైబీపి, గుండె సమస్యలతో పాటు అనేక సమస్యలకి కారణమవుతుంది.
అంగస్తంభన లోపం..
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల హైబీపి, ధమనులు మూసుకుపోవడం, రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇది పెల్విక్ ప్రాంతానికి రక్తప్రసరణని తగ్గిస్తుంది. పెల్విస్‌కి రక్త ప్రసరణని అడ్డుకుంటుంది. ఇది అంగస్తంభన ప్రధాన కారణాల్లో ఒకటి.
అలసట..
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపి పెరుగుతుంది. దీని వల్ల అలసట, నీరసం పెరుగుతుంది. ఈ కారణంగా కోరికలు తగ్గుతాయి.
ఆడవారికి కూడా..
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే లైంగిక జీవితంపై ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. కేవలం మగవారికే కాదు. ఆడవారిపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. యోని ప్రాంతంలో రక్తప్రవాహం తగ్గుతుంది. దీని వల్ల అంగస్తంభన సమస్యలు ఎదుర్కొంటారు.
హైబీపి చెక్ చేయడం..
మీరు అంగస్తంభనను సాధించడానికి, మెంటెయిన్ చేయడానికి రక్తప్రసరణ అవసరం. మీరు దీనివల్ల సమస్యని ఫేస్ చేస్తే మీ బీపిని చెక్ చేయడం మంచిది.
లైంగిక జీవితానికి..
ఆనందకరమైన లైంగిక జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే ముందుగా హెల్దీ లైఫ్‌స్టైల్ మెంటెయిన్ చేయాలి. మరీ ముఖ్యంగా అధిక బరువుని తగ్గించుకోవాలి. హెల్దీ డైట్ మెంటెయిన్ చేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. పుష్కలంగా పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి.