ఆసక్తికరంగా ‘గామి’ టీజర్.. మానవ స్పర్శ తెలియని అఘోరగా విశ్వక్ సేన్.. 🎬🔥
- Suresh D
- Feb 17, 2024
- 1 min read
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. మొదటి సారి ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో కనిపించనున్నారు. దీంతో గామి చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు.
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో విశ్వక్ సేన్. అశోకవనంలో అర్జున కళ్యాణం, పాగల్ చిత్రాలతో మెప్పించిన మాస్ కా దాస్.. ఇప్పుడు గామి సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే రొమాంటిక్, యాక్షన్ చిత్రాలు కాకుండా.. ఈ చిత్రాన్ని సరికొత్త నేపథ్యంతో తీసుకురాబోతున్నారు. డైరెక్టర్ విద్యాధర్ కాగిత దర్శకత్వం వవహిస్తున్న ఈ మూవీలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. మొదటి సారి ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో కనిపించనున్నారు. దీంతో గామి చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల ఫస్ట్ పోస్టర్ తోపాటు.. మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. 🎬🔥
తాజాగా విడుదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తుంది. స్టోరీ ఏమి చెప్పకుండా కేవలం పాత్రలను మాత్రమే రివీల్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్ శంకర్ అనే అఘోరా పాత్రలో కనిపించనున్నారు. అలాగే మరో రెండు భిన్నమైన గెటప్ లలో విశ్వక్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వి. సెల్యులాయిడ్ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ నిర్మించారు. ఈ సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించనున్నారు విశ్వక్. ఈ మూవీ కోసం నాలుగున్నరేళ్లుగా విశ్వక్ సేన్ కష్టపడుతున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ మూవీపై మరింత క్యూరియాసిటిని కలిగిస్తుంది. 🔥
మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించుకోవడమే కష్టం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న అఘోర శంకర్ హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ సినిమా అని మేకర్స్ పేర్కొన్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ఫిబ్రవరి 29న రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు మేకర్స్. గామి సినిమాను ఈ ఏడాది మార్చి 8న అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇందులో అభినయ, మహ్మద్ సమద్, హారిక పెడద, దయానంద్ రెడ్డి కీలకపాత్రలు పోషించారు. 🎥🎭
‘గామి’ టీజర్