వైభవంగా వెంకటేశ్ కుమార్తె వివాహ వేడుక🎉💍
- Suresh D
- Mar 16, 2024
- 1 min read
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి బజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హవ్యవాహిని వివాహం విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు కుమారుడు డాక్టర్ నిషాంత్తో ఘనంగా జరిగింది. రామానాయుడు స్టూడియోలో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు వెంకటేశ్ కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 🎉💍