🎥🌟 మొన్న KGF ఫ్యాన్స్, నేడు సలార్ ఫ్యాన్స్.. ఆ డైరెక్టర్‌పై మాస్ ట్రోలింగ్.. 🌟🎥
- Suresh D
- Dec 19, 2023
- 1 min read
అయితే ఈ సమయంలో టాలీవుడ్ యంగ్ దర్శకుడు, నటుడు వెంకటేష్ మహా పెట్టిన పోస్ట్ ఒకటి కాంట్రవర్సీగా మారింది. 🔄సలార్ తో పాటుగా రేస్ లో ఉన్న బాలీవుడ్ చిత్రం “డంకి” సినిమాకి తాను వెళ్తున్నట్టుగా పెట్టిన పోస్ట్ ఒక్కసారిగా టాలీవుడ్ ఫ్యాన్స్ లో కాంట్రవర్సియల్ గా మారింది.
ప్రస్తుతం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “సలార్” కోసం అందరికీ తెలిసిందే. 🌟 మరి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కోసం రెబల్ ఫ్యాన్స్ సహా ఇతర ఫ్యాన్డం కూడా ఎదురు చూస్తున్నారు. 🔥 అయితే ఇప్పుడిప్పుడే సలార్ ఫీవర్ పెరుగుతూ వెళ్తుంది. 🌐 అయితే ఈ సమయంలో టాలీవుడ్ యంగ్ దర్శకుడు, నటుడు వెంకటేష్ మహా పెట్టిన పోస్ట్ ఒకటి కాంట్రవర్సీగా మారింది. 🔄
సలార్ తో పాటుగా రేస్ లో ఉన్న బాలీవుడ్ చిత్రం “డంకి” సినిమాకి తాను వెళ్తున్నట్టుగా పెట్టిన పోస్ట్ ఒక్కసారిగా టాలీవుడ్ ఫ్యాన్స్ లో కాంట్రవర్సియల్ గా మారింది. 🔄 తెలుగు సినిమా డైరెక్టర్ అయ్యి ఉండి టాలీవుడ్ నుంచి ఇప్పుడు వస్తున్నా భారీ చిత్రం “సలార్” కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా డంకి పై మాత్రమే పోస్ట్ చేయడం పైగా తన సినిమా “ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య” రిలీజ్ టైం ప్రభాస్ చేసిన సపోర్ట్ ని కూడా తాను మర్చిపోయి ఇలా చేయడం తాను కావాలనే ట్రిగ్గర్ చేసినట్టు అయియిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. 🌈
దీనితో సోషల్ మీడియాలో తనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 🤔 అయితే తాను వివరణ ఇచ్చే పోస్ట్ చేసాడు కానీ అప్పటికే పరిస్థితి వేరేలా మారింది. 😕 దీనితో ఈ యంగ్ దర్శకుడు ట్విట్టర్ లో తన ఖాతాని డీయాక్టీవ్ చేసుకొని టోటల్ గా ఆఫ్ లైన్ వెళ్ళిపోయాడు. ❌ మరి ఇదే దర్శకుడు లాస్ట్ టైం ప్రశాంత్ నీల్ “కేజీయఫ్” విషయంలో కూడా చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యిన సంగతి తెలిసిందే. 🗣️✨