top of page

సాయి పల్లవితో కలిసి మళ్లీ నటించకపోవడానికి కారణమదే.. వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్..🎥✨

ఫిదా తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పటివరకు మరోసారి ఆ కాంబో రిపీట్ కాలేదు. ప్రస్తుతం ఎవరీ సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. అయితే ఫిదా తర్వాత మళ్లీ సాయి పల్లవితో కలిసి నటించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు వరుణ్.


డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమా సౌత్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించారు. ఈ సినిమాతోనే సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో వీరిద్దరి జోడికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరి కెమిస్ట్రీకి.. నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇండస్ట్రీలోనే వీరిద్దరూ హిట్ పెయిర్ గా నిలిచారు. ఫిదా తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పటివరకు మరోసారి ఆ కాంబో రిపీట్ కాలేదు. ప్రస్తుతం ఎవరీ సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. అయితే ఫిదా తర్వాత మళ్లీ సాయి పల్లవితో కలిసి నటించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు వరుణ్. ప్రస్తుతం తాను నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్.. ఈ విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వరుణ్ మాట్లాడుతూ.. “మా ఇద్దరి కాంబోలో మరో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరిగాయి. అందుకు ఇద్దరం కథ కూడా విన్నాం. కానీ ఈసారి చేస్తే ఫిదాను మించి ఉండాలని.. లేదంటే చేయకూడదని అనుకున్నాం. అందుకే మళ్లీ కలిసి నటించలేకపోయాం” అని తెలిపారు.

ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. మార్చి 1న ఈ మూవీ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఫిబ్రవరి 25న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా వరుణ్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు చిరు. అలాగే చిత్రయూనిట్ తోపాటు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు వరుణ్ తేజ్. ఈ సందర్భంగా ఫిదా సినిమా తర్వాత సాయి పల్లవి తో కలిసి నటించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. అలాగే తన కెరీర్ లో సూపర్ హిట్ అయిన గద్దలకొండ గణేశ్ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉందని..అంతేకాకుండా ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని అందుని చెప్పారు.

నితిన్, సాయి ధరమ్ తేజ్ లతో కలసి ఓ మూవీలో నటించాలనుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇండస్ట్రీలో నితిన్ తనకు మంచి స్నేహితుడని అన్నారు. ఓ సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా నెక్ట్స్ మూవీకి ఓకేలా కష్టపడతానని.. ప్రతి మూవీ ఫలితాన్ని విశ్లేషించుకుంటానని అన్నారు. ప్రస్తుతం వరుణ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించగా.. ఇండియన్ ఎయిర్ పైలట్ గా కనిపించనున్నారు వరుణ్. ఇందులో మానుషి చిల్లర్ కథానాయికగా నటిస్తుంది.🎥✨

 
 
bottom of page