top of page

టీ20 ప్రపంచ కప్‌లో పాక్‌కు యూఎస్ షాక్

ree

ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో సంచలన విజయం సాధించింది అమెరికా. డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూఎస్ సూపర్ ఓవర్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. సునాయాసంగా గెలుస్తామని భావించిన పాక్ సూపర్ ఓవర్‌లో 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

మహమ్మద్ అమీర్ వేసిన సూపర్ ఓవర్‌లో అమెరికా 18 పరుగులు చేయగా, పాక్ 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇది టీ20ల్లో పాక్‌పై అమెరికాకు తొలి విజయం. ముందుగా పాక్ 20 ఓవర్లలో 159/7 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ 44, షాదాబ్ ఖాన్ 40 పరుగులు చేశారు. సౌరభ్ నేత్రావల్కర్ 2, నోషతుష్ కెంజిగె 3 వికెట్లు తీసి పాక్‌ను కట్టడి చేశారు.

అమెరికా 20 ఓవర్లలో 159/3తో మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కి తీసుకెళ్లింది. మోనాంక్ పటేల్ 50, అరోన్ జోన్స్ 36 నాటౌట్, అండ్రీస్ గౌస్ 35 పరుగులు చేశారు. సూపర్ ఓవర్‌లో మోనాంక్ పటేల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.

 
 
bottom of page