ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ
- MediaFx

- Apr 9, 2024
- 1 min read
లండన్ హిత్రూ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వర్జిన్ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకొన్నాక.. దానిని మరో ప్రదేశానికి తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అది టెర్మినల్ వద్ద బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిక్రాఫ్ట్‌ను తాకింది. ఈ క్రమంలో టెర్మినల్ వద్ద బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను తగలడంతో రెండు విమానాల రెక్కలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. కాగా, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.












































