ట్రక్ హారన్ సౌండ్‌కి అదిరిపోయే స్టెప్పులు వేసిన బుడ్డోళ్లు..
- MediaFx

- Aug 12, 2024
- 1 min read
ఒక్కోసారి డీజే సౌండ్స్‌ని మించిన హారన్స్ ఉంటాయి. కొన్ని వినసొంపుగా ఉంటే.. మరికొన్ని మాత్రం తలనొప్పిని తెప్పిస్తాయి. అలాగే ఇప్పుడు ఓ ట్రక్‌కి సంబంధించిన హారన్ సౌండ్‌కి ఇండోనేషియాకి చెందని ఇద్దరు పిల్లలు తెగ డ్యాన్స్ చేశారు. అదిరిపోయే స్టెప్పులు వేసి వావ్ అనిపించారు. ఈ వీడియో చూస్తుంటే మీకు తెలీకుండానే మీ పెదాలపై నవ్వు అనేది వచ్చేస్తుంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన బైక్ దగ్గర ఇద్దరు పిల్లలు నిలబడి ఉన్నారు. అప్పుడు అటు నుంచి మంచి హారన్ సౌండ్‌తో ఓ ట్రక్ వచ్చింది. ఆ సౌండ్‌కి తగ్గ బీట్‌తో పిల్లలు ఇద్దరు తెగ డ్యాన్స్ చేశారు. ఆ ట్రక్ పై ‘ది వండర్ ఉమెన్’ అని రాసి ఉంది. డ్రైవర్ వైపు చూస్తు ఇంకా మరింత ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. నిజంగానే ఆ హారన్ సౌండ్‌కి పిల్లల డ్యాన్స్ మూమెంట్స్‌కి సరిగ్గా బీట్ సరిపోయింది. ఇప్పటి వరకూ ఈ వీడియోకు రెండు మిలియన్ల వరకూ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో ఏంటో మీరు కూడా చూసేయండి.












































