నేటి రాశి ఫలాలు..ఈ రాశుల జాతకులు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది✨🔮
- Suresh D
- Feb 3, 2024
- 3 min read
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ03.02.2024 శనివారం మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.✨🔮
మేష రాశి✨🔮
మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఉద్యోగులు క్రమంగా ఉన్న స్థితి సాధిస్తారు. భాగ్య శుక్రయోగం వల్ల విశేష ధనలాభముంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారంలో జాగ్రత్త. ప్రారంభించిన పనుల్ని మధ్యలో ఆపవద్దు. ఒక సంఘటన కనువిప్పు కలిగిస్తుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం చేయండి.
వృషభ రాశి✨🔮
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆశించిన ఫలితాలున్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సకాలంలో పనిచేస్తే ఇబ్బందులు తొలగుతాయి. మాటని పొదుపుగా వాడాలి. ప్రణాళికతో పనిచేస్తే మేలు జరుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆపద నుంచి బయటపడతారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
మిథున రాశి✨🔮
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులలో శ్రద్ధ వహించాలి. తొందరపడవద్దు. పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేయండి. కాలం వ్యతిరేకంగా ఉంది. ఆటంకాలు ఉంటాయి. ఆచితూచి వ్యవహరించాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ఎవరినీ నమ్మవద్దు. సొంత విషయాలు ఇతరులతో చర్చించవద్దు. ఎదురు చూస్తున్న పని ఒకటి ఆలస్యం అవుతుంది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగా ష్టకాన్ని పఠించండి.
కర్కాటక రాశి✨🔮
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు వ్యాపారపరంగా శుభఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులు మధ్యలో ఆపవద్దు. విజయానికి చేరువలో ఉన్నారు. అభివృద్ధి సాధించడానికి సరైన సమయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. లక్ష్యసాధనలో సమిష్టి కృషి అవసరం. ఆశయం సిద్దించేవరకు కృషి చేస్తూనే ఉండాలి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి✨🔮
సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. అధికార లాభం సూచితం. స్థిరత్వం ఏర్పడుతుంది. సంకల్ప బలంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి✨🔮
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు వ్యాపారపరంగా లాభాలున్నాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రయత్నం విశేషంగా చేయండి. విజ్ఞానపరంగా అభివృద్ధి గోచరిస్తోంది. ఆశయాలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. సొంత నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఓర్పు, పట్టుదల మిమ్మల్ని కాపాడతాయి. ఒక విషయంలో శుభవార్త వింటారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
తులా రాశి✨🔮
తులా రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగంలో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ధర్మమార్గంలో వాటిని అమలుచేయండి. ఆశించిన ఫలితాలు త్వరగా లభిస్తాయి. కొందరి ప్రవర్తన ఆత్మాభిమానాన్ని తగ్గించే విధంగా ఉంటుంది. సహనంతో వ్యవహరించాలి. వ్యాపారంలో నష్టాలు గోచరిస్తున్నాయి. సకాలంలో పనులు పూర్తి చేయాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
వృశ్చిక రాశి✨🔮
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు ఉద్యోగపరంగా శుభఫలితాలున్నాయి. ఏది కోరుకుంటారో అదే జరుగుతుంది. అదృష్టయోగం సూచితం. అధికారుల అంద దండలు లభిస్తాయి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆదర్శవంతమైన జీవితం లభిస్తుంది. గృహ భూ వాహన యోగాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారలాభాలు విశేషం. మిత్రుల సహకారం లభిస్తుంది. శుభవార్త వింటారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి✨🔮
ధనూ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలం. ఏకాగ్రతతో పనిచేయండి. ఆశిస్తున్నది వెంటనే లభిస్తుంది. శాంతంగా సంభాషించండి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది. ఆర్థికపరంగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు కలసివస్తాయి. రుణ సమస్యలు రానివ్వవద్దు. ఆనందంగా గడుస్తుంది. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి✨🔮
మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. నిర్ణయాలు తీసుకోబోయే ముందు లోతుగా ఆలోచించండి. మిత్రుల తోడ్పాటు అవసరం. పనులు సకాలంలో పూర్తిచేయండి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. అపరిచితులను నమ్మవద్దు. ఇతరులకు ధనం ఇస్తే తిరిగి రాదు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
కుంభ రాశి✨🔮
కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రయత్నాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి విశేషంగా కృషిచేయండి. వ్యాపారంలో కలసి వస్తుంది. గృహ వాహన యోగాలు శుభఫలితాలనిస్తాయి. పెట్టుబడులు అభివృద్ధిని సూచిస్తున్నాయి. ధర్మబద్ధంగా వ్యవహరించండి. బాధ్యతలను సకాలంలో పూర్తిచేయండి. చెడు ఊహించవద్దు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
మీన రాశి✨🔮
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగంలో సత్ఫలితాలను సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక ఆపద నుంచి బయటపడతారు. న్యాయపరమైన లాభాలున్నాయి. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.












































