పట్టాలపైకి మరో మూడు వందే భారత్ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోదీ..
- MediaFx

- Aug 31, 2024
- 1 min read
దేశంలో కొత్తగా మరో మూడు వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) పట్టాలెక్కాయి. ఇవాళ ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) వర్చువల్ విధానంలో ఈ మూడు రైళ్లను ప్రారంభించారు. దాంతో దేశంలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్ల సంఖ్య 54కు చేరింది. ఇప్పటికే 51 రైళ్లు అందుబాటులో ఉండగా.. ఇవాళ లాంచ్ మూడు రైళ్లతో కలిపి వాటి సంఖ్య 54కు చేరింది. కొత్తగా ప్రారంభమైన మూడు వందే భారత్ రైళ్లతో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఎందుకంటే ఆ మూడు రైళ్లలో ఒకటి మీరట్-లక్నో మార్గంలో నడువనుండగా, మరొకటి మధురై-బెంగళూరు, ఇంకొకటి చెన్నై-నాగర్‌కోయిల్ మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. కాగా, వందేభారత్ రైళ్లలో ప్రయాణించాలంటే టికెట్ ఛార్జీలు ఎక్కువ అయినా.. సమయం కలిసొస్తోంది. దాంతో ఈ రైళ్లకు ఆదరణ పెరుగుతున్నది.












































