🎵✨వింటేజ్ ఫీల్‌తో ‘డెవిల్‘ సెకెండ్ సింగిల్- ‘థిస్ ఇజ్ లేడీ రోజీ’ అంటూ ఎల్నాజ్ అందాల కనువిందు🎵✨
- Suresh D
- Nov 28, 2023
- 1 min read
తాజాగా ‘డెవిల్’ సినిమా నుంచి మరో సాంగ్ విడుదల అయ్యింది. ‘ధిస్ ఇజ్ లేడీ రోజీ’ అంటూ సాగే ఈ పాట కూడా సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో ల్నాజ్ నరౌజి తన అంద చందాలతో కనువిందు చేసింది. “డాన్స్ డాన్స్ మళ్లీ కొత్తగా.. డాన్స్ డాన్స్ కొంచెం మత్తుగా.. డాన్స్ డాన్స్ థిస్ ఇజ్ లేడీ రోజీ” అంటూ హాట్ హాట్ లుక్స్ తో ఎల్నాజ్ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేసింది. ఈ పాట కూడా వింటేజ్ ఫీల్ తోనే కొనసాగింది. శ్రీ హర్ష ఈ పాటకు లిరిక్స్ అందించగా, రాజ కుమారి పాడింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.🎵✨
