స్టార్ హీరోకు ప్రాణ భయం..
- MediaFx

- Jul 26, 2024
- 1 min read
బాలీవుడ్ కండల వీరుడు..! సిల్వర్ స్క్రీన్ పై ఎదురొచ్చిన రౌడీలను చితకొట్టే యోధుడైన సల్మాన్ ఖాన్.., ఇప్పుడు ప్రాణ భయంతో సతమతమవుతున్నాడు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. సెక్యూరిటీ తోడు లేనిదే.. బయటికి రాకుండా ఉన్నాడు. ఈ క్రమంలోనే పోలీసుల ఎదుట ఈ స్టార్ హీరో తన వాంగ్మూలం ఇచ్చారు. తన వాంగ్మూలంతో ఇప్పుడు మరో సారి బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఎస్ ! ఏప్రిల్ 14న తన గెలాక్సీ అపార్ట్ మెంట్ ముందు కాల్పుల జరిపిన నేపథ్యంలో.. స్టార్ హీరో సల్మాన్.. ఆ ఘటన జరిగిన కొన్న రోజుల తర్వాతే.. పోలీస్ స్టేషన్లో తన స్టేట్మెంట్ ఇచ్చారు. తనకు , తన కుటుంబానికి బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రాణ హాని ఉందని.. తమను చంపేందుకు వారు కుట్ర చేస్తున్నారని పోలీసులకు చెప్పారు. అయితే సల్మాన్ అప్పుడు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తాజాగా బయటికి వచ్చింది. బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది.












































