top of page

బాదం తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా ?


బాదం పప్పుతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిలోని ఫాస్ఫరస్‌, రాగి, ఇనుము, మెగ్నీషియం వంటివి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే బాదంను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని కొందరు భావిస్తుంటారు. అయితే ఇందులో నిజమెంత? బాదం పప్పులో నూనె ఉంటుందనేది వాస్తవమే.. అయినప్పటికీ కొలెస్ట్రాల్ మాత్రం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బాదం తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి నిజం లేదని నిపుణులు అంటున్నారు. అయితే బాదంను నెయ్యిలో వేయించుకొని తీసుకుంటే మాత్రం కొలెస్ట్రాల్ పెరగడం ఖాయమని చెబుతున్నారు. బాదంలో మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంపొందడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజు రెండు బాదంలను తీసుకోవాలని సూచిస్తున్నారు.

 
 
bottom of page