ఎన్నికల్లో కీలక ఘట్టం .. నేటి నుంచే నామినేషన్లు షూరూ 🗳️
- Suresh D
- Apr 18, 2024
- 1 min read
సార్వత్రిక ఎన్నికల్లో గురువారం కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. తుది విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మరికాసేపట్లో ఎన్నికల సంఘం జారీ చేయనుంది. నోటిఫికేషన్ జారీ తరువాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. సెలవు దినాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్‌లలో, అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ చేపడతారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. బరిలో నిలిచిన అభ్యర్ధుల జాబితాను ఏప్రిల్ 29న ప్రకటించనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29న అవకాశం ఇచ్చారు. మే 13న పోలీంగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. 🗳️📆